|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ ఆర్పీఎఫ్ పోలీసుల దుష్పప్రవర్తన కేసుల పర్యవేక్షణ సలహా కమిటీ సమావేశం
|
ప్రయాణికుల పట్ల రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే (జీఆర్) పోలీసులు బాధ్యతతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ ఆర్పీఎఫ్ పోలీసుల దుష్పప్రవర్తన కేసుల పర్యవేక్షణ సలహా కమిటీ సమావేశం విజ్ఞప్తి చేసింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వీఐపీ లాంజ్‌లో ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ సంజయ్ వెర్మ అధ్యక్షతన మంగళవారం ‘పోలీసుల దుష్పప్రవర్తన`సలహాలు’పై సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న పర్యవేక్షణ కమిటీ సభ్యులు కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ ఆర్పీఎఫ్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు సమన్వయంతో రైల్వే ప్రయాణికుల హక్కుల రక్షణ, భద్రత కోసం పనిచేయాలన్నారు. ప్రజల్లో ప్రశ్నించేతత్వం పెరిగిన విషయాన్ని గుర్తించి విధులు నిర్వహించాలన్నారు. రైళ్లలో పాంట్రీకార్ ప్రతినిధులు కొంతమంది ప్రయాణికులు, పోలీసుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులు, ప్రయాణికుల పట్ల ఆర్పీఎఫ్ పోలీసుల ప్రవర్తిస్తున్న వైఖరి, దుష్ప్రవర్తన కేసుల గురించి సమావేశం చర్చించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సమావేశం తీర్మానించింది. పాంట్రీకార్ విధులు, హక్కులు, బాధ్యతలు గురించి ప్రయాణికుల అవగాహన కోసం కోచ్‌లలో బోర్డులను ఏర్పాటు ఐఆర్టీసీను సభ్యులు కోరారు. కొంతమంది ప్రయాణికులు బాధ్యతలు విస్మరించి పోలీసులు పట్ల ఆక్షేపనీయంగా వ్యవహరించడం పట్ల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రైల్వే ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం కేటాయించిన 139 నెంబర్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని సభ్యులు కోరారు. నడుస్తున్న రైళ్లు, ప్లాట్ ఫారాలలో ప్రయాణికులకు ఇటు పోలీసుల వల్ల అటు సహచర ప్రయాణికుల వల్ల నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికార వర్గాలకు తెలియజేస్తున్న సమాచారం ఒకేసారి ఆర్పీఎఫ్, గవర్నమెంటు రైల్వే పోలీసులకు సమాచారం అందేలా రైల్వే బోర్డు చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. ప్రస్తుతం ఉన్నతాధికారులకు సమాచారం అందిన అనంతరమే క్షేత్రస్ధాయిలో విధులు నిర్వహించే అధికారవర్గాలకు సమాచారం అందుతుందని దీనివల్ల సకాలంలో ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులకు సేవలందడం లేదని సమావేశం అభిప్రాయపడిరది. దురుసుగా, అనైతికంగా ప్రవరిస్తున్న పోలీసుల సమాచారాన్ని 139 నెంబర్‌కు ఫోన్ చేయాలని ప్రయాణికులకు సమావేశం విజ్ఞప్తి చేసింది. సమావేశంలో ఆర్పీఎఫ్ పోలీసుల దుష్పప్రవర్తన కేసుల పర్యవేక్షణ సలహా కమిటీ సభ్యులు కాండ్రేగుల వెంకటరమణ, ఎ.లక్ష్మణరావు, విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆర్పీఎఫ్ జీఆర్పీఎస్ ప్రతినిధులు ఎం.రమణ, సిహెచ్. వెంకట్రావు, పి.కోటేశ్వరరావు, పుష్పరాణి బిసోయ్, బి.ఎల్.పటి, ఎన్.ఎస్.మీనా తదితరులు పాల్గొన్నారు.
|
|
Tuesday, May 24, 2022 5/24/2022 12:23:04 PM
|
Keywords |
RPF, TTE, Railway Platforms, Kandregula, RTI Activist,
|
|
|
|
|
|
|
|
|
TODAY LATEST NEWS UPDATED
|
|
|
|
|
|
|
|
The Best Vizag News Portal in Vizag and Visakhapatnam,
Vizag News, Hospitals in Vizag, Schools in Vizag, Vizag Photos, Latest Vizag
News with Photos, Visakhpatnam Latest News Updates, Vizag Shopping, offers in
Vizag, services in vizag, Fashion in Vizag, News in Vizag, Shopping in vizag,
Realestate in Vizag, Education in vizag, School in Vizag, Colleges in Vizag,
Ticket Booking in Vizag, Tourism in Vizag, Jobs in vizag, Job Consultancies in
Vizag, Vizag videos, Vizag photos, vizag Publicity portal , Vizag online
portals, vizag new portals, visakhapatnam online shopping portsl, Kailash
Giri, Rushikonda beach, RK beach, Railway Station, Lodges in vizag, Transport
services in vizag, Travels in vizag, Restaurants in Vizag, Universities in
vizag, Engineering Colleges in vizag, Hospitals in vizag, Medical Services
in vizag, Medical Equipments, Doctors in vizag, Youth entertainmnet in vizag,
Cinema theatres in Vizag, Electronics Stores in vizag, Mechanical Services
in vizag, House Hold equipments services in vizag, Companies in vizag, Software
companies in vizag, Industrial Services in vizag.
|