|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
సంస్కర్తల ఆలోచనా విధానాన్ని తన హృదయపై ముద్రించుకొని రచనలు చేసి సమాజదృకోణాన్ని మార్చిన వ్యక్తి చిలకమర్తి
|
ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆధ్వర్యంలో పద్యకవి కళాప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంపంతులు గారి జయంతి వేడుకలు నిర్వహించబడ్డాయి.తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా చిలకమర్తి వారి చిత్రపటానికి ఆచార్యులు,పరిశోధక విద్యార్ధులు,స్నాతకోత్తర విద్యార్ధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త, విశాఖ సారస్వత వేదిక అధ్యక్షులు మరియు బి వి కె కళాశాల తెలుగు విభాగం పూర్వ శాఖాధ్యక్షులు డా దామెర వేంకట సూర్యరావు మాట్లాడుతూ ఆనాడు రాజమహేంద్రవరం, విజయనగరం రెండూ కూడా సాహిత్య సాంస్కృతిక కళా రంగాలకు వేదికగా ఉన్నాయని రాజమహేంద్రవరం సంప్రదాయ సాహిత్యానికి పట్టుగొమ్మగా ఉన్నప్పటికీ సమాజంలోని మూఢవిశ్వాసాలు ప్రజల జీవితాలను అస్ధిరపరుస్తున్న దుస్ధితిని గ్రహించి కందుకూరి వీరేశలింగం పంతులు గారు సరళసుందరైన భాషతో ,విద్యాసౌగంధాన్ని వెదజల్లుతూ సాహిత్యంలో వివిధ ప్రక్రియలను ఆలంభనగా చేసుకొన రచనలు చేసారని అదే విధంగా విజయనగరంలో గురజాడ సమాజానికి అడుగు జాడై నూతన దృక్ఫధంతో వ్యవహారిక భాషా సౌందర్యాన్ని తన రచనల్లో పొందుపరుస్తూ సమాజ రుగ్మతలపై కవితాఖడ్గాన్ని ఝుళిపించారని ఈ ఇద్దరి సంస్కర్తల ఆలోచనా విధానాన్ని తన హృదయపై ముద్రించుకొని రచనలు చేసి సమాజదృకోణాన్ని మార్చిన వ్యక్తి చిలకమర్తి అని కొనియాడారు. వారి రచనల్లో సంఘసంస్కరణ దృక్ఫధంతో పాటు దళితాభ్యుదయ కాంక్ష కనిపిస్తుందన్నారు. కందుకూరి గారు స్త్రీలకోసం పరితపించి బాలికాపాఠశాలలు ఏర్పాటుచేస్తే చిలకమర్తి వారు దళితులకోసం పాఠశాలలు ఏర్పాటు చేసి అందులో దళిత అధ్యాపకులను నియమించిన ఘనత చిలకమర్తి వారిదేనన్నారు.అంతేగాదుచదువుకోలేని వయస్సు పైబడిన వారు కోసం స్వాతంత్య్రానికి పూర్వమే వయోజన విద్యాకేంద్రాలను ఏర్పాటుచేసిన విద్యాప్రదాత అని వివరించారు.వారికి తక్కువ వయస్సులోనే అంటే 30వయస్సులోనే రేచీకటి కారణంగా ఇబ్బందులకు గురైనప్పటికీ మనస్సుకు ఏటువంటి రేచీకటి లేదని తన హృదయాభావనలను అక్షరబద్దంచేసి సమాజ దిశానిర్ధేశానికి మార్గదర్శకుడై బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పిల్చిపిప్పిచేస్తున్న వైనాన్ని *"భరతఖండబు చక్కనిపాడియావు"*వంటి గేయంలో యావత్ భారతీయుల హృదయ స్పందన తెలియజేసిన మొదటి జాతీయకవి అని తెలియజేసారు.వారి రచనల్లో ప్రతి రచన సమాజ స్పృహను తట్టిలేపే విధంగా ఉంటాయని ఆయన చారిత్రక నాటకాలు వ్రాసినా,ప్రహాసనాలను ప్రతిష్టంచినా,నవలా సాహిత్యం సృష్టించినా,పద్యకవిత్వంతో ప్రతిసృష్టి చేసినా,జీవితయాత్ర లతో ప్రయాణించినా అందులో సంస్కరణ దృక్ఫధమే కన్పిస్తుందన్నారు. చిలకమర్తి జాతీయోద్యమ ప్రభావంతో అనేక చారిత్రిక నాటకాలు రాస్తే అందులో గయోపాఖ్యానం అజరామరమై వెలుగొందిందని అనాడే ఆ నాటక ప్రతులు లక్షకు పైగా అమ్ముడుపోయాయంటే ఆ నాటకం సమాజంపై ఎంతఋప్రభావానికి గురిచేసిందో అర్ధం చేసుకోవచ్చాన్నారు.నేటి సమాజ దుస్ధితికి,సోమరిపోతుల విన్యాసలకు,ఉబుసుబోకు కబుర్లు చెబుతూ మనుషులను తన మాయమాటలతో ఏవిధంగా జీవిస్తారో. వారు ఎదుటివారిని ఏ విధంగా బలి చేసి తమ జీవనాన్ని గడుపుకుంటారో కళ్లకు కట్టినట్లు చిత్రించిన నవల గణపతి. తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి మొట్టమొదట హాస్య నవల గా దీనిని అభివర్ణించవచ్చు. ఈ నవల్లో కథానాయకుడు గణపతి రకరకాల ఉద్యోగాలు చేస్తూ దేంట్లో స్థిరంగా ఉండక సమాజాన్ని ఏ విధంగా దోచుకుంటున్నాడో వివరిస్తూ అటువంటి వారికి దూరంగా ఉండాలని అందుకే ప్రధాన సాధనం విద్యే అని సమాజానికి కనువిప్పు కలిగించారన్నారు.వందల సంవత్సారాలు గడిచినప్పటికీ వారి వ్యక్తిత్వాన్ని,రచనల్ని గుర్తుచేసుకోవటానికి కారణం వాటిలో మానవజీవతానికి ఉపయోగపడే జీవామృతపు బోధనలు ఉండటమే ప్రధానకారణం అన్నారు
|
|
Monday, September 26, 2022 9/26/2022 2:54:43 PM
|
Keywords |
Chilakamarthi, Surya Rao,
|
|
|
|
|
|
|
|
|
TODAY LATEST NEWS UPDATED
|
|
|
|
|
|
|
|
The Best Vizag News Portal in Vizag and Visakhapatnam,
Vizag News, Hospitals in Vizag, Schools in Vizag, Vizag Photos, Latest Vizag
News with Photos, Visakhpatnam Latest News Updates, Vizag Shopping, offers in
Vizag, services in vizag, Fashion in Vizag, News in Vizag, Shopping in vizag,
Realestate in Vizag, Education in vizag, School in Vizag, Colleges in Vizag,
Ticket Booking in Vizag, Tourism in Vizag, Jobs in vizag, Job Consultancies in
Vizag, Vizag videos, Vizag photos, vizag Publicity portal , Vizag online
portals, vizag new portals, visakhapatnam online shopping portsl, Kailash
Giri, Rushikonda beach, RK beach, Railway Station, Lodges in vizag, Transport
services in vizag, Travels in vizag, Restaurants in Vizag, Universities in
vizag, Engineering Colleges in vizag, Hospitals in vizag, Medical Services
in vizag, Medical Equipments, Doctors in vizag, Youth entertainmnet in vizag,
Cinema theatres in Vizag, Electronics Stores in vizag, Mechanical Services
in vizag, House Hold equipments services in vizag, Companies in vizag, Software
companies in vizag, Industrial Services in vizag.
|