పేక మేడలు సినిమా యూనిట్ విశాఖలో సందడి చేసింది.
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై నా పేరు శివ ఫేమ్
వినోద్ కిషన్ హీరోగా, అనూష కృష్ణ హీరోయిన్ గా
నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో
రాకేష్ వర్రే నిర్మాణంలో యూత్ ఫుల్ ఫ్యామిలీ సినిమా పేకమేడలు చిత్రం ప్రమోషన్ లో భాగంగా సోమవారం డాబాగార్డెన్స్ వద్ద గల 7లాంప్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
హీరో
వినోద్ కిషన్ మాట్లాడుతూ, క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన
ఈ సినిమా ఈనెల 19 న విడుదల అవుతుంది అన్నారు. స్మారన్ మంచి సంగీతం అందించారు అని పేర్కొన్నారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు అన్నారు. తనకు హీరోగా ఇది తొలి సినిమా. ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుంది అన్నారు. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో తీసిన చిత్రం ఇది. అందరికీ నచ్చే సినిమా ఇది. ఇందులో హీరో పాత్ర పరిస్థితులు బట్టి ఊసరవెల్లి మాదిరిగా మారుతుంది అని చమత్కరించారు.
హీరోయిన్
అనూష కృష్ణ మాట్లాడుతూ, తనకు తెలుగులో ఇది తొలి సినిమా. గతంలో కన్నడ సినిమాలు చేశాను అన్నారు. సింహాచలం స్వామి ఆసీస్సులు తీసుకున్నాం. సినిమా తప్పకుండా విజయవంతం అవుతుంది.
దర్శకుడు నీలగిరి మామిళ్ళ ఈ సినిమా బాగా తెర కేక్కించారు అన్నారు.
నిర్మాత రాకేష్ వర్రె మాట్లాడుతూ, సినిమా ప్రమోషన్ కోసం విశాఖ రావడం ఇదే తొలిసారి అని తెలిపారు. తాను గతంలో
బాహు బలి, మిర్చి సినిమాల్లో నటించాను అని గుర్తు చేశారు.
సినిమాల మీద ఆసక్తితో నే నిర్మాణ రంగంలోకి కూడా వచ్చాను. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు మీడియా ఆదరిస్తారు అని పేర్కొన్నారు. చిత్రం ట్రైలర్ కి ఇప్పటికే మంచి ఆదరణ వచ్చింది. విశాఖ ప్రేక్షకులు సినిమాలు బాగా ఆదరిస్తారు అని సంతొషం వ్యక్తం చేశారు. తాను హీరోగా నటించిన సినిమా విశాఖ లోనే తీశాం అని తెలిపారు. తాను విశాఖ అల్లుడిని అని తెలిపారు. మద్య తరగతి ప్రజలు పడే బాధలు, హాస్య భరితంగా తెర కెక్కించాం. ఆఖరి అరగంట క్లైమాక్స్ సినిమాకి హైలైట్ అవుతుంది అన్నారు. సినిమా టికెట్ రేట్లు తగ్గించే ప్రయత్నాలు చేస్తాం అన్నారు. స్మారన్ మంచి సంగీతం అందించారు అని ప్రశంసించారు. కథ డిమాండ్ ఆధారంగానే వేరే హీరోను తీసుకున్నాం అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.