ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపిజీఈఏ) నూతన
రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న
కే.ఆర్. సూర్యనారాయణ మీద గత వైసిపి ప్రభుత్వ హయాంలో పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని ఆ సంఘ
సిటీ అధ్యక్షుడు డి.రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపి జీ ఈ ఏ) తరపున నూతనముగా ఎన్నిక అయిన విశాఖపట్నం సిటీ యూనిట్ సభ్యుల మీడియా సమావేశం నిర్వహించారు. సిటీ అధ్యక్షుడు డి.రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత నెల 11 న జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగిందన్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా
కే ఆర్ సూర్యనారాయణ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈయన మీద గత వైసిపి ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు పెట్టారన్నారు. ఈ కేసులు రద్దు చేయాలని ప్రస్తుత టిడిపి ప్రభుత్వాన్ని కోరారు. తమ రాష్ట్ర, జిల్లా సంఘం ఆదేశాలు ప్రకారమే పని చేస్తామన్నారు. ఏఎస్ఆర్ జిల్లా అద్యక్షుడు ఎస్.వీ రమణ మాట్లాడుతూ తమ సంఘం ప్రభుత్వాలకు భజన కాదు బాధ్యతతో పని చేస్తామన్నారు. రాజకీయ పార్టీలతో కాదు ప్రభుత్వంతో కలిసి చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. గత ప్రభుత్వం తమకు తెలియకుండా
జీపీఎఫ్ సొమ్ము ఇతర అవసరాలకు వాడుకుందన్నారు. డిఎ, టిఎ బకాయిలు చెల్లించలేదన్నారు.ఈ డిమాండ్ల సాధనకు గవర్నర్ ను కలిశారన్న కారణంగా తమ రాష్ట్ర అధ్యక్షుడు సూర్య నారాయణ మీద తప్పుడు కేసులు పెట్టారని గుర్తు చేశారు. దీనికి కారణమైన సజ్జాల రామ కృష్ణ రెడ్డి, మాజీ సీ ఎస్. జవహర్ రెడ్డి మీద జుడీషియల్ ప్రివ్యూ కమిషన్ వేయాలని కోరారు. జిల్లా డివిజన్ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అతని మీద గత ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంభించిందని ఆరోపించారు. వాణిజ్య పన్నుల శాఖలో కొందరు అధికారులు లబ్ధి కోసం పునర్వ్యవస్థీకరణ అమలు చేశారన్నారు. దీంతో రాష్ట్రంలో 1500 పోస్టులు రద్దు అయ్యాయన్నారు. ఉపాధ్యక్షురాలు సుచరిత మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సి వచ్చిందిని విచారం వ్యక్తం చేశారు. సంఘం అనకాపల్లి అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ, అక్రమ కేసులు వెంటనే రద్దు చేయాలని కోరారు.
ఈ ఎన్నికల్లో కార్యదర్శి డి.వి.ఎస్.ఎన్ రాజు, కోశాధికారి డి.హరగోపాల్, ఉపాధ్యక్షుడు కే. వెంకట రావు, ఎం.అమర్నాథ్, బీ.సుచరిత నితాల్, సి.గణేష్ మారుతి, ఐ. గోపీ కృష్ణ, సంయుక్త కార్యదర్శిలుగా పీ.వెంకటేష్, బీ.ప్రసాద్, ఎస్.దిలీప్ కుమార్, కే.రోహిణి కుమార్, ఎస్.భాను రేఖ, బీ.సతీష్ కుమార్ ఎన్నికయ్యారని తెలిపారు.