అక్టోబర్ 2022 లో ప్రారంభమయ్యే పన్నెండు నెలల వ్యవధిలో దేశంలోని 10 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను అందించడానికి ఉపాధి కల్పన దిశగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో రోజ్‌గార్ మేళా ఒకటి. రోజ్‌గార్ మేళా 1 నుంచి 10వ విడతల్లో భాగంగా అక్టోబర్ 2022 నుంచి అక్టోబర్ 2023 వరకు నిర్వహించిన రోజ్‌గార్ మేళాకు సుమారు 55,000 నుంచి 77,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లు జారీ చేయబడ్డాయి. రోజ్‌గార్ మేళా యొక్క 11వ విడతలో ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా 51,000 కంటే ఎక్కువ నియామక లేఖలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు , సంస్థలు.
సెంట్రల్ బోర్డ్ పరోక్ష పన్నులు - కస్టమ్స్, విశాఖపట్నం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఇటీవల ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లను జారీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11వ విడత రోజ్‌గార్ మేళా నిర్వహించింది. ఈ మేళా గురువారం విశాఖలోని సాలి గ్రామపురం సాగరమాల కన్వెన్షన్స్‌లో విశాఖపట్నం కస్టమ్ హౌస్ ద్వారా ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలు, అండర్‌టేకింగ్‌ల సమన్వయంతో నిర్వహించబడింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రోజ్‌గార్ మేళాను ప్రారంభించారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సంజయ్ పంత్, చీఫ్ కమిషనర్, కస్టమ్స్ - జీ ఎస్ టి, విశాఖపట్నంలో రోజ్గర్ మేళాకు అధ్యక్షత వహించారు.
రోజ్‌గార్ మేళా సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ ఎస్ సి, బీ ఎస్ అర్ బీ, ఆర్ ఆర్ బీ వంటి వివిధ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ప్రముఖులచే భౌతికంగా నియామక లేఖలు అందజేశారు. రైల్వేలు, పోస్టల్, రక్షణ దళాలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆదాయపు పన్ను,
సి ఐ ఎస్ ఎఫ్, ఐటీబీపి వంటి పారామిలిటరీ బలగాలు, ఏ ఐ ఐ ఎం ఎస్-మంగళగిరి, ఐ ఐ ఎం, ఐ ఐ ఐ టి కేంద్రీయ విద్యాలయాలు వంటి విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీ వంటి వివిధ విభాగాలలో ఉపాధి పొందిన వారికి నియామక పత్రాలు పంపిణీ చేశారు.
ఈ మేళాలో అసిత్ కుమార్ మోహపాత్ర, ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమీషనర్, ఎన్. శ్రీధర్, ప్రిన్సిపల్ కమీషనర్, కస్టమ్స్, సౌరభ్ ప్రసాద్,
డి ఆర్ ఎం, తూర్పు కోస్తా రైల్వే, సి హెచ్ వి ఎన్ భాస్కర్ రావు, జనరల్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్
ఇండియా, డాక్టర్ ముఖేష్ త్రిపాఠి, డైరెక్టర్, ఏ ఐ ఐ ఐ ఎం ఎస్ (మంగళగిరి) సి. హెచ్. ప్రసాద రావు, అసిస్టెంట్
కమీషనర్, కేంద్రీయ విద్యాలయ సంగతన్‌తో పాటు వివిధ కేంద్రాల అధికారులు
పలు