బీచ్ రోడ్డులో ప్రారంభానికి సిద్ధమవుతున్న సీ-హారియర్ మ్యూజియం విశాఖపట్నంలో
స్ధాపించడమనేది రాష్ట్రానికి గర్వకారణం అని రాష్ట్ర పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ నెల
11వ తేదీన విశాఖలో జరుగు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు గుడివాడ అమర్నాథ్,ఆదిమలుపు
సురేష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత వర్మ, జాయింట్ కలెక్టర్ కె.యస్
విశ్వనాథన్ లతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన చేయు ప్రదేశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముందుగా సీ-
హారియర్ మ్యూజియం పనులు అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి మ్యూజియం సందర్శన
సమయంలో చేయు ఏర్పాట్లపై విఎంఆర్డిఏ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి విశాఖ పర్యటనలో బాగంగా కొన్ని
అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటిగా పి.ఎమ్ పాలెం లో గల
వైయస్సార్ క్రికెట్ స్టేడియం దగ్గర రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ, ఆరిలోవ అపోలో ఆసుపత్రి లో నిర్మించిన అన్కాలజీ
బ్లాక్ ప్రారంభోత్సవం , అనంతరం బీచ్ రోడ్డులో ఉన్నంటువంటి సి- హారియర్ యుద్ధ విమాన మ్యూజియంను
ప్రారంభించడం జరుగుతుందన్నారు. సీ- హారియర్ యుద్ధ విమాన మ్యూజియంను దాదాపు 10 కోట్ల రూపాయల
వ్యయంతో నిర్మించినట్లు తెలిపారు. దేశానికి ప్రతిష్టగా నిలబడినటువంటి సీ- హారియర్ మ్యూజియం ప్రపంచంలో
ఇతర దేశంలో కేవలం రెండు చోట్ల మాత్రేమే ఉందని, భారతదేశంలో ఒక్క విశాఖపట్నంలో స్ధాపించడమనేది రాష్ట్రానికి
గర్వకారణం అని తెలిపారు. విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన సి- హారియర్ మ్యూజియం విశాఖ
వాసులకు , టూరిస్టులకు మరింత సమాచారాన్ని , ఆహ్లాదాన్ని చేకూరుస్తుందని అన్నారు. టి యు 142 , కురుసుర
సబ్ మెరైన్ పాటు సి- హారియర్ మ్యూజియం కూడా చేర్చడం వలన విద్యార్థులు, యువత ఎన్నో విషయాలను
తెలుసుకోడానికి అవకాశం ఉందని తెలిపారు.ఇక్కడ ఏర్పాటు చేసిన యుద్ధ విమానాన్ని గోవా నుంచి తీసుకురావడం
జరిగిందన్నారు. రాంనగర్ లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను సీ-హారియర్ మ్యూజియం
వద్ద ప్రారంభించనున్నారన్నారు. అనంతరం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు
కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలకు హాజరవుతారన్నారు.
మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి మంత్రి ఆదిములపు సురేష్ కుమార్ మాట్లాడుతూ బీచ్
రోడ్డులో ప్రారంభించనున్న సీ-హారియర్ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందన్నారు. నేవీ, ఎయిర్ ఫోర్స్ కు
సంబంధించిన సాంకేతిక అంశాలు ప్రజలకు తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని కానీ ఈ మ్యూజియం
ఏర్పాటు ద్వారా యువత ,పిల్లలు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖలో కురుసుర
సబ్ మెరైన్ , టి యు 142 యుద్ధ విమానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని దీనితోపాటుగా మ్యూజియం ఇక్కడ
ఏర్పాటు చేయడం విశాఖ ప్రజలకు, యువతకు, టూరిస్టులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు .
ఈ కార్యక్రమంలో జీవియంసి కమీషనర్ సాయికాంత్ వర్మ,జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ ,
విఎమ్ఆర్డిఏ , జీవీఎంసీ , ఆర్ అండ్ బి , పోలీస్, ఫైర్, ఏపీఈపీడీసీఎల్ తదితర అధికారులు పాల్గొన్నారు.