కళాభారతిలో జరుగుతున్న 5 రోజుల కళాభారతి - కీ. శే. పైడా కౌశిక్ నాటకోత్సవాలు నేడు రెండవ రోజు.
ముందుగా నేటి కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి Dr. గుమ్ములూరి రాంబాబు, మహారాజ పోషకులు శ్రీ పైడా కృష్ణ ప్రసాద్, ముఖ్య అతిధి శ్రీ C. P. రామారావు, Dr. K. G. వేణు జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేసేరు.
ముఖ్య అతిధి అన్ని కళలను ఆదరించి ప్రోత్సాహించడం చాలా గొప్పవిషయమని ముఖ్యంగా నాటకారంగాన్ని ప్రోత్హస్తున్నందుకు కళాభారతి వారిని అభినిందిస్తున్నానని అన్నారు.
అనంతరం గోవాడ క్రియేషన్ అసోసియేషన్ హైదరాబాద్ వారు "మూల్యం " నాటిక అత్యంత గొప్పగా నటులందరూ జీవించి నటించారు.
నేటి సమాజంలో మహిళలను వివాహనంతరం అత్యంత బానిసలుగా చూస్తూ అవమానపరుస్తూ తక్కువ చేస్తూన్న తరుణంలో మహిళా ధైర్యంగా ప్రతిఘటించి మహిళలు నేటి సమాజంలో ఎందులోనూ తక్కువ కాదని సంపాదనలో మగవారికంటే మహిళలే ఎక్కువ సంపాదితున్నారని అదనంగా స్త్రి ఇంటి పని వంట్సపనే కాకుండా భర్త, పిల్లల పని కూడా చేస్తూ వస్తున్న గొప్ప వ్యక్తిత్వం గలిగినదని నిరూపించి సమాజానికి స్త్రీని సమానంగా చూస్తూ గగౌరవించాలని ఒక మంచి సందేశాత్మకంగా ప్రదర్శించిన నాటికను ప్రేక్షకుల కారతాల ధ్వనులతో అభినందించారు.
వారికి ముఖ్య అతిధి శ్రీ రామారావు ప్రదర్శనా పారితోషకం 13,000/-, ప్రశంస పత్రాలు అందజేసేరు.
తరువాత రెండవ నాటిక ఉషోదయ కళా నికెతన్, కట్రపాడు వారు " విముక్తి " ప్రదర్శించారు.
ప్రస్తుత కాలంలో యువత మత్తు మందులకు బానిసలయి వారి ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.
పిల్లలు ప్రయోజకులయి తల్లి దండ్రులను బాగా చూసుకుంటారని ఎన్నో ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ మత్తులో మునిగి వారి ఆశలను నిరాశలుగా చేస్తున్నారు. ఈ తరుణంలో పెద్దలు పట్టుదలతో పిల్లలకు మత్తు బానిసత్వం నుండి విముక్తి కాలించాలని మంచి సందేశాన్నిస్తూ ప్రదర్శించిన తీరు అద్భుతం.
చివరగా వచ్చిన ప్రేక్షకులతో లక్కీ డిప్ తీయించి ముగ్గురికి 1వ, 2వ, 3వ బహుమతులు కార్యదర్శి Dr. రాంబాబు అందించి, అధికంగా వచ్చిన ప్రేక్షకులకు అభినందనలు తెలియజేసేరు.
5 రోజులూ అందరికి ప్రవేశం ఉచితమని, లక్కీ డిప్ లో పాల్గొనేందుకు కూపన్స్ గేట్ వద్ద ఉచితంగా పొంద వచ్చని తెలియజేసేరు.