ఇ - ఎలక్ట్రానిక్ డిజిటల్ మెషిన్లు ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశ్యం నగరంలో గల ప్రతీ పోలీసు అధికారి మరియు సిబ్బంది వీటితో యాక్సిస్ అయి, తమ ఆరోగ్యం పై ఎల్లవేళలా అవగాహన కలిగి ఉండడం, సిబ్బంది ఫోన్ నెంబరుతో అనుసంధానం అనంతరం వారి ఆరోగ్య వివరాలు ఈ మిషన్లలో నమోదు చేసుకున్నాక , వారి ఆరోగ్య వివరాలను నిరంతరం మానిటరింగ్ చేస్తూ, వారికి ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు కలిగితే వెంటనే అవసరమైన హెచ్చరికలను వారి మొబైల్ కు జారీ చేస్తుంది.
సీపీ గారు సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు వ్యూహాత్మకముగా ఆలోచించి సిబ్బందికి అనారోగ్య సమస్యలు కలిగినప్పుడు ఆయా సమస్యలకు తగ్గ ఆరోగ్య సూచనలు ఇవ్వడం తో పాటుగా, ఏ వైద్యుడిని సంప్రదించాలో తెలిపే సాప్ట్ వేర్ సిటీ పోలీసు లకు అందుబాటులోనికి తెచ్చేలా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
స్వతహాగా వైద్యుడైన సిపి గారు ఇప్పటివరకూ నగర పోలీసులకు ఆరోగ్యం పరిరక్షణ విషయం లో ఎల్లవేళలా అవగాహన కలిగించడమే కాకుండా సిబ్బంది ఆరోగ్య సంరక్షణ నిమిత్తం చక్కెర వ్యాధి, రక్త హీనత, ఊభకాయం ,రక్త పోటు అనీ , అవి ఎంత స్థాయిలో ఉండాలో, ఏ స్థాయిలో ఉంటే ప్రమాదమో తెలుపుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. సిబ్బంది తమ బిపి నిత్యం చెక్ చేసుకొనే విధముగా నగర పోలీసు శాఖకు బిపి మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు, మహిళల కు ప్రత్యేకముగా బ్రెస్ట్ క్యాన్సర్, ఇతర వ్యాధుల పై అవగాహన కలిగేలా మెడికల్ క్యాంపులు నిర్వహించారు.
గతంలో పోలీసు ఆరోగ్య భద్రత అధికారిగా ఉన్న అనుభవం తో సిపి గారు గడిచిన 10 సంవత్సరాల కాలంలో పోలీసు సిబ్బంది 2% నుండి 3% పలు వ్యాధులతోనూ, ఆరోగ్యం పై అవగాహనా లోపం తోనూ మరణించారని, అదే విధముగా పోలీసు శాఖ నుండి పదవీ విరమణ చేసిన అనంతరం 10 సంవత్సరాల లోపు 9% పైగా మృత్యవాతపడుతున్నారని వీటికి ప్రధాన కారణం ఆరోగ్యం పై అవగాహనా లేక, సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం అని తెలిపారు.
నగర పోలీసు శాఖ సిబ్బంది కి ఆరోగ్యం పై పూర్తి అవగాహన కలిగేలా, ఆరోగ్యంగా ఉండి ప్రశాంతముగా జీవించడం పై అవగాహన కలిగేలా , CULTURE OF GOOD HEALTH అను వినూత్న కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భముగా తెలియజేశారు.
జాయింట్ సిపి శ్రీ ఫక్కిరప్ప కాగిణెల్లి, ఐ.పీ.ఎస్., గారు ,శ్రీ మావూరి వెంకట రమణ, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సి.ఎం.ఆర్ గ్రూప్స్ , డి.సి.పి (క్రైమ్స్) గారు, ఎ.సి.పి లు, ఇతర అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమం కోసం, , సిబ్బంది సంక్షేమం కోసం, సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం సీపీ గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ పట్ల నగర పోలీసు సిబ్బంది తో పాటూ వారి కుటుంబ సభ్యులు తమ హర్షం తెలియజేస్తూ సీపీ గారికి, జాయింట్ సీపీ గారికి ,నగర పోలీసు శాఖ కు వీటిని అందజేసిన సి.ఎం.ఆర్ గ్రూప్స్, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గారికితమ కృతజ్ఞతలు తెలియజేశారు.