|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
ఎంతోమంది నిరుద్యోగులకు తాము ఉపాధి కల్పిస్తున్నామన్నారు ఫిన్వెస్కో క్యాపిటల్ ఎండీ జక్కంపూడి రవీంద్ర
|
నగరంలోని కొమ్మాదిలో ‘ఫిన్వెస్కో క్యాపిటల్’ (ఎన్‌బీఎఫ్‌సీ) మరో నూతన కార్యాలయం ప్రారంభించింది. సంస్థ ఎండీ జక్కంపూడి రవీంద్ర శుక్రవారం ఈ కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. అతిథులుగా సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆర్.స్కైలాబ్, శ్రీకర మ్యాక్స్ డైరెక్టర్ వీవీ గణపతి, ఫిన్వెస్కో జీఎంలు టి.జగన్‌మోహన్, ఎస్‌ఎం బాషా, క్లస్టర్ హెడ్ బి.తిరుపతిరావు తదితరులు హాజరయ్యారు. రవీంద్ర మాట్లాడుతూ తిరుపతిలో మరో కొత్త కార్యాలయం ప్రారంభిస్తున్నామని, పెట్టుబడిదారులకు ఇదే ఆహ్వానమన్నారు. అంతేకాకుండా తమ సంస్థ అందిస్తున్న ప్రత్యేక సదుపాయాల్నీ ఆయన క్షుణ్ణంగా వివరించారు. స్కైలాబ్ మాట్లాడుతూ ఆర్‌బీఐ సర్టిఫికెట్ పొందామని, కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లో ఉండగా, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ తమ శాఖల్ని విస్తరిస్తున్నామన్నారు. సంస్థ డైరెక్టర్ రాకేష్ అలమంద ఆధ్వర్యంలో 13నెలల వ్యవధిలోనే 10వేల మంది మహిళలకు వ్యాపార రుణాల్ని అందజేశామని, మరో 25శాఖల్ని ప్రారంభించి 17వేల సముదాయాలకు రూ.50కోట్ల రుణాల్ని మంజూరు చేసే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. మిగతా అతిథులు మాట్లాడుతూ ఎంతోమంది నిరుద్యోగులకు తాము ఉపాధి కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీఎంలు ఎస్.రాము, సీహెచ్ శ్రీనివాసరావు, సిబ్బంది వి.దుర్గా ప్రసాద్, పి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
|
|
Friday, August 9, 2024 8/9/2024 7:25:16 AM
|
Keywords |
Finvesco Capital, Jakkampudi Ravindra, Srikar Macs,
|
|
|
|
|
|
|
|
|
TODAY LATEST NEWS UPDATED
|
|
|
|
|
|
|
|
The Best Vizag News Portal in Vizag and Visakhapatnam,
Vizag News, Hospitals in Vizag, Schools in Vizag, Vizag Photos, Latest Vizag
News with Photos, Visakhpatnam Latest News Updates, Vizag Shopping, offers in
Vizag, services in vizag, Fashion in Vizag, News in Vizag, Shopping in vizag,
Realestate in Vizag, Education in vizag, School in Vizag, Colleges in Vizag,
Ticket Booking in Vizag, Tourism in Vizag, Jobs in vizag, Job Consultancies in
Vizag, Vizag videos, Vizag photos, vizag Publicity portal , Vizag online
portals, vizag new portals, visakhapatnam online shopping portsl, Kailash
Giri, Rushikonda beach, RK beach, Railway Station, Lodges in vizag, Transport
services in vizag, Travels in vizag, Restaurants in Vizag, Universities in
vizag, Engineering Colleges in vizag, Hospitals in vizag, Medical Services
in vizag, Medical Equipments, Doctors in vizag, Youth entertainmnet in vizag,
Cinema theatres in Vizag, Electronics Stores in vizag, Mechanical Services
in vizag, House Hold equipments services in vizag, Companies in vizag, Software
companies in vizag, Industrial Services in vizag.
|