పి జె కె మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ ఉలిశెట్టి హీరోగా, శాంతిప్రియ, హీరోయిన్లు గా ఉదయ్ కుమార్ దర్శకత్వంలో లడ్డే బ్రదర్స్ నిర్మించిన చిత్రం "ఎంత పని చేశావ్ చంటి" చిత్ర ప్రమోషన్ లో భాగంగా సిరిపురం లో గల ఒక హోటల్ లో బుధ వారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో సినిమా యూనిట్ తో పాటుగా జబర్దస్త్ టీమ్ ఆర్టిస్ట్ లు పాల్గొన్నారు.
హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ మొత్తం విశాఖలో జరిగింది అన్నారు. ఈ సినిమా అక్టోబర్ 25 న విడుదల అవుతుంది అన్నారు. తాను నటించిన తొలి సినిమా ఇదే అన్నారు. నిర్మాత, దర్శకుల నమ్మకం నిలబెట్టుకునేల నటించాను. ఇక 25 న రిజల్ట్ చూడాలి అన్నారు. ఆడవాళ్ళకు మాత్రమే ట్యాగ్ లైన్ తో సినిమా విడుదల చేస్తున్నాం. కుటుంబంలో జరిగే సంఘటనలు ఆధారంగా సినిమా తెరకెక్కింది. మంచి జరిగితే తట్టుకోలేము అన్నారు. నరసాపురంలో 19 న ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. సినిమా ప్రీ రిలీజ్ రిలీజ్ ఈవెంట్ డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం లో ఈనెల 22 వ తేదీన జరుతుంది అని తెలిపారు. జబర్దస్త్ అప్పారావు కి మరింత పేరు తెచ్చేలా పాత్ర చేశారు. మనిషి లోపల ఇంకోలా వుంటారు. ఏ సర్టిఫికెట్ వున్నా సరే అందరూ చూడదగ్గ సినిమా అన్నారు.
పవన్ సిద్దార్థ్ వీనుల విందుగా సంగీతం అందించారు అని ప్రశంసించారు.
అందరి లో కామన్ గా వున్న పాయింట్ తీసుకుని సినిమా వుంటుంది. చంటి పాత్ర వివాహం అయిన వ్యక్తి లో అంతర్గతం గా వుండే లక్షణాలు సినిమాలో చూపించాము
అని పేర్కొన్నారు.
హీరోయిన్ నీహారిక మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో కుటుంబ సమేతంగా చూసే సినిమాలు రాలేదు. ఈ నేపథ్యంలో ఇటువంటి సినిమా చేయడం ఆనందంగా ఉందని అన్నారు. తన పాత్ర కుటుంబం, సమాజంలో ఎదుర్కున్న సంఘటనలు ఆధారంగా సినిమా తెరకెక్కింది అన్నారు.
డైరెక్టర్ ఉదయ కుమార్ మాట్లాడుతూ, తాను గతంలో తస్మాత్ జాగ్రత్త సినిమా తీసాను అని గుర్తు చేశారు. ఇది పూర్తిగా కుటుంబ కదా చిత్రం. నూతన నటీనటులు నటించారు. విశాఖ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ చేశాం అన్నారు. విశాఖలో ఇంకా షూటింగ్ చేయని ఎన్నో లోకేషన్లు పుష్కలంగా వున్నాయి అన్నారు. భార్యా భర్తలు అన్యోన్యం కథతో సినిమా వుంటుంది. ఇందులో ఐదు పాటలు వున్నాయి అని తెలిపారు.
నటి సూర్య ( జూనియర్ సూర్య కాంతం) మాట్లాడుతూ, తాను నటించిన సినిమా ఇదే అన్నారు. సూర్య కాంతం పాత్ర లతో యు ట్యూబ్ రీల్స్ చేశాను అని గుర్తు చేశారు. తన తల్లి రేవతి ప్రోత్సాహంతోనే తాను సూర్య కాంతం రీల్స్ చేశాను అన్నారు. జూనియర్ సూర్య కాంతం పాత్ర చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కో - డైరెక్టర్ బత్తిన సూర్య నారాయణ మాట్లాడుతూ, విశాఖ లోనే పూర్తిగా సినిమా తీశాం. సాంకేతిక నిపుణులు కూడా విశాఖ వాసులే అన్నారు. ఐదు కుటుంబాల మద్య జరిగిన సంఘటనలు ఈ సినిమాలో వుంటాయి. భార్య భర్తల మధ్య అనుమానం బదులు అన్యోన్యత వుండాలి అన్న సందేశంతో సినిమా వుంటుంది అన్నారు.
నటుడు
అమ్మారాజ్ మాట్లాడుతూ, భార్య భర్తల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది అన్నారు. పాటలు చాలా బాగా వచ్చాయి. ఇది పూర్తిగా కుటుంబ కదా చిత్రం అన్నారు. అందరి ఇంట్లో జరిగిన కథే ఈ సినిమా అని తెలిపారు. ఈ సినిమాకు జీ.రాము కో ప్రొడ్సుసర్ గా వ్యవహరించారు. సంతోష్ ఫోటోగ్రఫీ అందించారు.