|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ బిల్డర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు
|
తణుకు మున్సిపల్ కమీషనర్ ద్వారా 2021-2022 సంవత్సరంలో రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయిన కొంతమంది భూమి యజమానులకు జారీ చేసిన ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్మెంట్ రైట్స్ (టిడిఆర్ ) ప్రభుత్వం ద్వారా ఏర్పడిన సమస్యల మూలంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ బిల్డర్లు చేపట్టిన1800 ప్రాజెక్టులు ఆగిపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని ఏపీ టిడిఆర్ బిల్డర్ల సంఘం ప్రతినిధి రాజశేఖర్ వేడుకున్నారు. మంగళవారం వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున తణుకు టిడిఆర్లు అప్పటి అధికారులు తణుకు మున్సిపల్ కమీషనర్ ద్వారా 2021-2022 సంవత్సరంలో కొంతమంది భూమి యజమానులకు జారీ చేశారని, ఏదైనా జారీకి అనుసరించే ప్రామాణిక సాధారణ విధానం ప్రకారం జారీ చేయబడిందన్నారు. బిల్డర్లు పైన పేర్కొన్న బాండ్లను ప్రభుత్వ పోర్టల్ నుండి అధికారికంగా కొనుగోలు చేసామన్నారు. వాటిని మా ప్రాజెక్ట్‌ల వినియోగం కోసం లింక్ చేసామన్నారు. అయితే టిడిఆర్ బాండ్ల జారీలో ఉల్లంఘనలు,మోసం జరిగినట్లు పేర్కొంటూ గత ప్రభుత్వం బాండ్లను ఫిబ్రవరి 2022 లో బ్లాక్ చేసిందన్నారు. ఈ బాండ్ల జారీలో తణుకు మున్సిపల్ కమిషనర్ అవకతవకలకు పాల్పడ్డారని, ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం విచారణలో పేర్కొందన్నారు. టీడీఆర్ బాండ్ల యజమానులు కూడా మా సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదన్నారు. దీంతో మేం ఏపీ హైకోర్టును ఆశ్రయించామన్నారు. దీంతో పాటు బిల్డర్లకు న్యాయం చేయాలని గత ప్రభుత్వంపై కేసులు పెట్టామన్నారు. ఏపీ హైకోర్టులో దాదాపు 21 నెలల పాటు 24-06-2022 నుండి 19-03-2024 వరకు కోర్టు విచారణల క్రమం తరువాత, కోర్టు2024 మార్చి 19న న ఉత్తర్వు తేదీ నుండి కచ్చితంగా 2 నెలల వ్యవధిలో సమగ్ర విచారణ జరపాలని ఆదేశించిందన్నారు.అయితే, సార్వత్రిక ఎన్నికల కారణంగా విచారణ ఆలస్యమై, గడువులోగా జరగలేదన్నారు విచారణ జరగలేదన్నారు. కొత్త కూటమి ప్రభుత్వం ఈ విషయంలో మాకు మద్దతు ఇస్తుందని, మా బిల్డర్లకు న్యాయం చేస్తుందని నమ్మినట్లు తెలిపారు.కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 14న ప్రభుత్వ పోర్టల్ నుండి అధికారికంగా కొనుగోలు చేసిన 29 తణుకు
టిడిఆర్ బాండ్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మూలంగా బిల్డర్లకు భారీ ఆర్థిక నష్టాలను సృష్టిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మీద దాదాపు 800 ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. పై ఆర్డర్‌ను అమలు చేయడం ద్వారా బిల్డర్లు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి బిల్డర్‌లా సమస్యను తీసుకొస్తున్నామని ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్ముతున్నామన్నారు. నష్టపోయిన బిల్డర్లకు న్యాయం చేయడానికి అవసరమైన దిద్దుబాటు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, ఈ సంక్షోభం నుండి మమ్మల్ని రక్షించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ దిద్దుబాటు చర్య బాధిత బిల్డర్లకు భారీ ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుందని, రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించడంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో చాలా దూరం వెళ్తుందని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో బిల్డర్ల సంఘం ప్రతినిధులు ఏ.సాయి ఆనంద్, ఎన్.శ్రీధర్, జి.బి.అనిల్ కుమార్, మణి, పృద్వి పాల్గొన్నారు.
|
|
Tuesday, October 22, 2024 10/22/2024 12:02:38 PM
|
Keywords |
TDR Builders Association, Rajasekhar
|
|
|
|
|
|
|
|
|
TODAY LATEST NEWS UPDATED
|
|
|
|
|
|
|
|
The Best Vizag News Portal in Vizag and Visakhapatnam,
Vizag News, Hospitals in Vizag, Schools in Vizag, Vizag Photos, Latest Vizag
News with Photos, Visakhpatnam Latest News Updates, Vizag Shopping, offers in
Vizag, services in vizag, Fashion in Vizag, News in Vizag, Shopping in vizag,
Realestate in Vizag, Education in vizag, School in Vizag, Colleges in Vizag,
Ticket Booking in Vizag, Tourism in Vizag, Jobs in vizag, Job Consultancies in
Vizag, Vizag videos, Vizag photos, vizag Publicity portal , Vizag online
portals, vizag new portals, visakhapatnam online shopping portsl, Kailash
Giri, Rushikonda beach, RK beach, Railway Station, Lodges in vizag, Transport
services in vizag, Travels in vizag, Restaurants in Vizag, Universities in
vizag, Engineering Colleges in vizag, Hospitals in vizag, Medical Services
in vizag, Medical Equipments, Doctors in vizag, Youth entertainmnet in vizag,
Cinema theatres in Vizag, Electronics Stores in vizag, Mechanical Services
in vizag, House Hold equipments services in vizag, Companies in vizag, Software
companies in vizag, Industrial Services in vizag.
|