ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తోన్న చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' దీపికా కథానాయిక. దర్శక ద్వయం నితిన్, భరత్ దీనిని తెరకెక్కిస్తున్నారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ప్రదీప్ మాట్లాడుతూ.. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది సిద్ధమవుతోందన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తొలి సాంగ్ విడుదలైంది. 'ఎవ్వడో ఈడి కొచ్చినాడు సూడు' అంటూ సాగే ఈ పాటను ఉదిత్ నారాయణ ఆలపించారని మనసుని హత్తుకునే ఈ మెలొడీకి శ్రీధర్ లిరిక్స్ అందించారన్నరు. ఈ పాటను నటుడు మహేశ్ బాబు విడుదల చేశారని అదే గొప్ప అచివమెంట్ గా భావిస్తున్నామని తెలిపారు.. వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉందని ఉందన్నారు. యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయని వివరించారు.. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈఎగ్జైటింగ్ఎంటర్‌టైనర్‌లో నిర్మితమైన ఈ చిత్రం తప్పక ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుందన్నారు..
విశాఖలో పాటుగా అరకు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించామన్నారు .. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసిన సాహిత్యం అద్భుతంగా వుందని,
సిద్ శ్రీరామ్ తన మెస్మరైజింగ్ వోకల్స్ తో ట్రాక్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారన్నారు... ప్రదీప్ దీపికల కెమిస్ట్రీ, ఆన్-స్క్రీన్ ప్రేమకథ అద్భుతంగా ప్రజెంట్ చేసిందన్నారు.. తొలి చిత్రం లాగానే, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలకు ముందే మ్యూజికల్ హిట్‌గా సంచలనాలు సృష్టిస్తుందన్నారు.
విశాఖ లో ఏ సినిమా చిత్రీకరించిన అది తప్పక విజయం సాధిస్తుందని సెంటిమెంట్ ఉంది నా మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం కూడా విశాఖలో అధికశాతం చిత్రీకరించి హిట్టు కొట్టానని అదే సెంటిమెంట్తో 80% షూటింగ్ విశాఖలోని చిత్రీకరణ జరిగిందన్నారు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊపేస్తున్న బెట్టింగ్ వ్యవహారం పై ప్రదీప్ మాట్లాడుతూ కచ్చితంగా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు అందరూ వ్యతిరేకించాలని ఎవరో అటువంటి ప్రమోషన్ చేయకూడదు అన్నారు వాటిని ప్రమోట్ చేయడం ద్వారా ఎందరో జీవితాలు నాశనం అవుతున్నాయి అన్నారు
అనంతరం హీరోయిన్ దీపిక పిల్లి మాట్లాడుతూ సినిమాకి తన క్యారెక్టర్ ద్వారానే కదంతా నడుస్తుందని హీరో ప్రదీప్ తో నటించడం ఎంతగానో ఆనందంగా ఉందన్నారు ఢీ షోలో కలిసి పలు షో లు కలిసి పనిచేసాం అని ఇప్పుడు ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతగానో ఆనంద్ పడుతున్నానన్నారు కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆమె..
అరకు ప్రాంతంలో సినిమా షూటింగ్లో స్థానికులు ఎంతో ప్రేమ అభిమానాలు ఇచ్చారన్నారు..విశాఖ అందమైన ప్రాంతం అన్నారు
కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అని అందరూ
మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో . ఎప్రిల్ 11న అన్ని థియేటర్లో విడుదల కాలున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రాన్ని చూసి ఆదరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు