ఆంధ్ర విశ్వవిద్యాలయం, బయోకెమిస్ట్రీ విభాగం నుంచి మొట్టమొదటి పేటెంట్ మంజూరు అయ్యింది. డా. అపరంజి
పూసర్ల రూపొందించిన “టైప్ 2 డయాబెటిస్ కోసం పోర్టబుల్ బయోసెన్సార్” కి పేటెంట్ లభించింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ గారు తన ఆవిష్కరణతో పేటెంట్ సాధించిన డా.
అపరంజి పూసర్లను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా అభివృద్ధి చేసిన సాంకేతికత, పురోగతిని
కమర్షియలైజ్ చేసిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రక్త నమూనా అవసరం లేకుండానే డయాబెటిస్ మరియు
ఇతర సంక్రమణ రోగాలను తొందరగా గుర్తించే సాంకేతికతను డా. అపరంజి, అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారు.
డాక్టర్ అపరంజి అభివృద్ధి చేసిన సాంకేతికత విధానం, రోగులకు మరింత సౌకర్యవంతమైన మరియు నొప్పిలేని
ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
డా. పి. అపరంజి ఆవిష్కర్త, పేటెంట్ సాధించడం పట్ల, ఆమె ఈ రంగంలో చేస్తున్న కృషిని బయోకెమిస్ట్రీ విభాగాధిపతి
ప్రొఫెసర్ టి. రాఘవ రావు గారు అభినందించారు. ప్రొఫెసర్ ఎం. జగన్నాధ రావు మరియు కె. అచ్చుత రావు లు డాక్టర్
అపరంజిని అభినందించారు.
ఇప్పటికే అభివృద్ధి చేసిన సాంకేతికతను కమర్షియలైజ్ చేసే విధానంలో భాగంగా ఈ సాంకేతికతను 2022లో అక్షయ
ఇన్నోటెక్ అనే పరిశ్రమకు బదలాయించారు.