|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను భారతీయ సంస్థలకే ఇవ్వాలననే బలమైన ప్రతిపాదన
|
రక్షణ రంగ పరిశోధనాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యుల భాగస్వామ్యం ఉండాలని ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఏ.యూ అమెరికన్ కార్నర్ లో ఏయూ రీసెర్చ్ డెవలప్మెంట్ విభాగం, ఎస్ఐడిఎం సంయుక్తంగా నిర్వహించిన ఆప్టిమైజింగ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ క్యాపబిలిటీస్ విత్ కొలాబరేషన్ ఆఫ్ ఎక్స్పర్ట్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏ యూ వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ పీహెచ్డీ పరిశోధకులకు ఒక అధ్యయన అంశంగా రక్షణ సంబంధ సమస్యను అందించాలని సూచించారు. ఈ పరిశోధన ప్రాజెక్టులలో విద్యార్థులను వివిధ దశల్లో భాగస్వాములను చేయడం ఎంతో అవసరమని అన్నారు. యూజీ,పిజి, పీహెచ్డీ విద్యార్థులను ఇటువంటి పరిశోధన సంబంధిత అంశాలలో భాగస్వాములను చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఆసక్తి కలిగిన ఆచార్యులతో ఒక గ్రూపును తయారు చేస్తామని అన్నారు. డి ఆర్ డి ఓ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIDM) ఏపీ శాఖ చైర్మన్ శ్రీనివాస రాజు మాట్లాడుతూ రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను భారతీయ సంస్థలకే ఇవ్వాలననే బలమైన ప్రతిపాదన ఉందని చెప్పారు. మేధావులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని విశాఖలో ఏర్పాటు చేయడానికి తాము కృషి చేస్తున్నామని, దీనిలో ఏ.యూ కీలకంగా పనిచేయాలని ఆయన కోరారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి లభిస్తున్న సహకారాన్ని తెలియజేశారు. అభివృద్ధి చేసే ఒక సాంకేతికతను విభిన్న రంగాలలో ఉపయోగిస్తున్న విధానాలను వివరించారు. దేశీయంగా సాంకేతికతను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యులు, నిపుణుల సహకారం తమకు కావాలని కోరారు. తద్వారా సంపదను సృష్టించడం, నూతన జ్ఞానాన్ని పెంపొందించడం, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాకారం చేయడం సాధ్యపడుతుందని అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ రంగం, పునరుత్పాదక ఇంధన వనరులు, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగాలలో పరిశోధనలకు విస్తృత అవకాశం ఉందని వివరించారు. నేడు భారత్ సాటిలైట్లకు ప్రత్యామ్నాయాలను అన్వేషించే దిశగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంతో తాము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సాంకేతిక అంశాలతో పాటు న్యాయ మేనేజ్మెంట్ విభాగాల్లో తమకు నిపుణుల అవసరం గణనీయంగా ఉందని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా ఏయూ తరఫున శ్రీనివాసరాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్ డెవలప్మెంట్ విభాగం డీన్ ఆచార్య వి.వల్లి కుమారి, అసోసియేట్ డీన్ ఆచార్య పి.వి.వి సత్యనారాయణ, ప్రాజెక్ట్స్– ఐపీఆర్ విభాగం ప్రొఫెసర్ ఇంచార్జ్ ఆచార్య బి. కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
|
|
Friday, June 20, 2025 6/20/2025 3:16:39 PM
|
Keywords |
AU American Corner, VC Raja Sekhar, SIDM, Srinivas Raju,
|
|
|
|
|
|
|
|
|
TODAY LATEST NEWS UPDATED
|
|
|
|
|
|
|
|
The Best Vizag News Portal in Vizag and Visakhapatnam,
Vizag News, Hospitals in Vizag, Schools in Vizag, Vizag Photos, Latest Vizag
News with Photos, Visakhpatnam Latest News Updates, Vizag Shopping, offers in
Vizag, services in vizag, Fashion in Vizag, News in Vizag, Shopping in vizag,
Realestate in Vizag, Education in vizag, School in Vizag, Colleges in Vizag,
Ticket Booking in Vizag, Tourism in Vizag, Jobs in vizag, Job Consultancies in
Vizag, Vizag videos, Vizag photos, vizag Publicity portal , Vizag online
portals, vizag new portals, visakhapatnam online shopping portsl, Kailash
Giri, Rushikonda beach, RK beach, Railway Station, Lodges in vizag, Transport
services in vizag, Travels in vizag, Restaurants in Vizag, Universities in
vizag, Engineering Colleges in vizag, Hospitals in vizag, Medical Services
in vizag, Medical Equipments, Doctors in vizag, Youth entertainmnet in vizag,
Cinema theatres in Vizag, Electronics Stores in vizag, Mechanical Services
in vizag, House Hold equipments services in vizag, Companies in vizag, Software
companies in vizag, Industrial Services in vizag.
|