శ్రీ శ్రీ శ్రీ జగన్నాథ్ బహుడ(తిరుగు) రథయాత్ర ను హరేకృష్ణ మూవ్మెంట్ వారు 5వ తేది జూలై 2025 శనివారం న సంప్రదాయ పద్దతిలో మన మురళీనగర్ NGGO's కాలనీ లోని శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానము నుండి మొదలై వర్మ కాంప్లెక్స్, ఈస్ట్ పార్కు, మురళీనగర్ జంక్షన్ మీదగా మధవధార VMRDA కమ్యూనిటీ హాల్ వద్ద ముగించడం జరిగింది .
ఈ కార్యక్రమములో పాలుగున్న అతిధులు
శ్రీమాన్ గోపినంబళ్ల శేషాచార్యులు ప్రధానార్చకులు - శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానము,
శ్రీ బండారు ప్రసాద్ , కార్యనిర్వాణ అధికారి - శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానము,
డాక్టర్ నిష్కించన భక్త దాస, ప్రెసిడెంట్ హరేకృష్ణ మూవ్మెంట్, విశాఖపట్నం.
రథోత్సవం యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు:
1. రథోత్సవం : ఈ ఉత్సవంలో భాగంగా అందంగా అలంకరించబడిన రధం మీద శ్రీ జగన్నాధుడిని అలంకరించి ఉండగా, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ రథాన్ని లాగటం జరిగింది. ఈ రథోత్సవం శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానము నుండి మొదలై వర్మ కాంప్లెక్స్, ఈస్ట్ పార్కు, మురళీనగర్ జంక్షన్ మీదగా మధవధార VMRDA కమ్యూనిటీ హాల్ వద్ద ముగించడం జరిగింది .
2. సాంస్కృతిక ప్రదర్శనలు: ఈ కార్యక్రమంలో ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ సంజన కూచిపూడి నృత్యాలయం వారి విద్యాదులచే ప్రదర్శనలు ప్రదర్శించబడ్డాయి.
3. భక్తి కార్యకలాపాలు: ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరూ, కీర్తనలు, నృత్యాలు, భగవంతుడి యొక్క నామస్మరణం చేస్తూ వివిధములైన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం జరిగింది.
4. ప్రసాదం వితరణ : రథయాత్ర ప్రారంభము నుంచి ముగింపు వరకు సుమారు ఐదు వేల నుండి ఏడు వేలమంది భక్తులకు మనం స్వామి వారి మహా ప్రసాదం అందించటం జరిగింది. దారి పొడుగునా అనేక మంది భక్తులకు మా సేవకర్తలు ప్రసాదం అందించటం జరిగింది.
ఈ కార్యక్రమములో అధిక సంఖ్యలో భక్తులు ఉత్సహముగా పాల్గొనుటకు రథయాత్రలో మంగళ వాయిద్యములు, కోలాటములు, వివిధ సంగీత వాయిద్యములతో సంకీర్తనల నడుమ నాట్యంతో భక్తులు శ్రీ జగనాథుని సేవలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులయ్యారు .