ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్
ఎండోమెంట్ లెక్చర్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ
న్యాయమూర్తి మరియు భోపాల్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్
గౌరవనీయులైన జస్టిస్ గోడ రఘురామ్చ ట్టం, సామాజిక క్రమం ; రాజ్యాంగ దృక్పథాలు
అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. కాన్షియస్నెస్ తో జీవనం సాగించడం, దీన్ని
కాపాడుకోవడానికి చట్టం అవసరమని అన్నారు. రాజ్యాంగం ప్రజలందరినీ ఐక్యం చేస్తుందని
రాజ్యాంగ రచించిన విధానాన్ని ప్రత్యేకతలను వివరించారు.
ప్రజలు తమను తాము పాలించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నవే చట్టాలని మనుషులను
ఇతర జీవులతో వేరు చేసేది కేవలం కాన్షియస్నెస్ మాత్రమేనని చెప్పారు. నిత్యం కొత్త
విషయాలు నేర్చుకోవాలని తపన కలిగి ఉండాలని సూచించారు. సమాజావిర్భావం, మానవ
పరిణామ క్రమాన్ని విద్యార్థులకు వివరించారు. నేడు మనం పొందిన జ్ఞానాన్ని, దీనిని
మనకు అందించడానికి కృషి చేసిన అనేకమంది పూర్వీకుల కృషిని గుర్తు చేసుకోవాలని
చెప్పారు. ఇతర దేశాల రాజ్యాంగంలో లేని ఒక ప్రత్యేకమైన అంశం భారత రాజ్యాంగం కలిగి
ఉందని ఇది సివిల్ సర్వెంట్లకు సైతం రక్షణను కల్పిస్తోందని తెలిపారు.తన ప్రసంగంలో
న్యాయం, సమానత్వం మరియు సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో చట్టం పాత్రను వివరించారు.
విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గౌరవ అతిథిగా
హాజరయ్యారు. ఎండోమెంట్ లెక్చర్లు విద్యార్థులకు విభిన్న అంశాలపై అవగాహన
అందించడానికి ఉపయోగపడతాయని చెప్పారు. తాను స్వయంగా విశ్వవిద్యాలయంలో 8
ఎండోమెంట్ లెక్చర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తన అభివృద్ధికి దోహద పడిన ఆంధ్ర
విశ్వవిద్యాలయానికి నేటి తరం విద్యార్థులకు ఉపయోగపంగా వీటిని ఏర్పాటు చేశామని చెప్పారు త్వరలో మరికొన్ని ఎండోమెంట్ లెక్చర్లను నిర్వహించడానికి ప్రయత్నాలను
చేస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ ఈ కార్యక్రమానికి
అధ్యక్షత వహించారు. ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ శతాబ్ది సంవత్సరంలో ఉన్న ఆంధ్ర
విశ్వవిద్యాలయం ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను నిర్వహించే ఒక క్యాలెండర్ ను
విడుదల చేసిందని చెప్పారు. దీనిలో మొదటి కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని
ఏర్పాటు చేశామని వివరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను
అభ్యసించిన అనేకమంది జాతీయస్థాయిలో విశిష్ట స్థానాల్లో నిలిచారని వివరించారు. న్యాయ
విద్య అభ్యసించే ప్రతి విద్యార్థి నైతికతకు ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్తు తరానికి మార్గ
నిర్దేశం చేస్తూ విశ్వవిద్యాలయ ఘనచరితను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. సీతా
మాణిక్యం న్యాయ కళాశాల ప్రత్యేకతలను ఎండోమెంట్ లెక్చర్ ఏర్పాటు చేసిన వివరాలు
వివరించారు.
కార్యక్రమంలో ముందుగా న్యాయ కళాశాల వద్దనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి
పూలమాలవేసి నమస్కరించారు అనంతరం అక్కడ పలు పండ్ల మొక్కలను నాటారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతిని పురస్కరించుకొని న్యాయ కళాశాలలో ఉన్న రవీంద్రనాథ్
ఠాగూర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు,
విశ్రాంత ఆచార్యులు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.