ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఇంజనీరింగ్ కళాశాల గౌతమ బుద్ధ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో సోమవారం
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబులిటీస్,
ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగం సంయుక్తంగా నిర్వహించిన పర్పుల్ ఫెయిర్
కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య కిషోర్ బాబు
మాట్లాడుతూ దివ్యాంగులలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని
సూచించారు. సాధారణ విద్యార్థులతో సమానంగా వీరిని తీర్చిదిద్దే దిశగా ఉపాధ్యాయులు
కృషి చేయాలని అన్నారు. దివ్యాంగులలో ఉన్న నైపుణ్యాలను, సృజనాత్మకతను ప్రదర్శించే
వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సమానత్వం మానవ
హక్కు అని దీనిలో అందరినీ భాగం చేయడం ముందుకు తీసుకువెళ్లడం అభివృద్ధిలో భాగం
చేయడం అవసరమని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రత్వ శాఖ డైరెక్టర్ వినీత్ సింఘాల్
మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా విద్యలో అందరిని భాగం చేయడం
లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోఅవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం
శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్న శుభసమయంలో ఇటువంటి కార్యక్రమానికి ఏయూ
తోడ్పాటును అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
సభాధ్యక్షులు, విద్యావిభాగాధిపతి ఆచార్య టి.షారోన్ రాజు మాట్లాడుతూ దివ్యాంగులు తమ
సామర్ధ్యాలను ప్రదర్శించడానికి, వారి నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ వేదిక
ఎంతో ఉపయోగంగా నిలిచిందని అన్నారు. మనోవైకల్యాన్ని అధిగమిస్తూ వారు తమ
ప్రతిభతో ఉన్నతంగా ఎదగడానికి అవసరమైన మార్గాలను చూపడం, వారికి దిశా నిర్దేశం
చేయడం ఎంతో అవసరమని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు ప్రణాళికలకు ఒక
నూతన శక్తిని, స్ఫూర్తిని అందిస్తాయని అన్నారు. ఇటువంటి చిన్నారులను తీర్చిదిద్దడానికి
పనిచేస్తున్న విద్యాసంస్థలు, అధ్యాపకులు ఎంతో అభినందనీయులని చెప్పారు. అదే
సమయంలో దివ్యాంగ చిన్నారులను సాధారణ పౌరులుగా నిలపడానికి వారి తల్లిదండ్రులు
చూపిస్తున్న చొరవ, తపనను అభినందించాలని అన్నారు. ఇటువంటి సామాజిక బాధ్యత
కలిగిన కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఎన్ ఐ ఈ పి ఐ డి(NIEPID )కి ఆంధ్ర
విశ్వవిద్యాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. దివ్యాంగులు సైతం సమాజంలో
గౌరవంగా బతకాలని వారి జీవనం హుందాగా సాగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని
చేపట్టడం జరిగిందని వివరించారు. భవిష్యత్తులో దివ్యాంగుల జీవితాలు ప్రకాశవంతంగా
ఉండాలని అన్నారు.
NIEPID డైరెక్టర్ డాక్టర్ బి.వి రామ్ కుమార్ మాట్లాడుతూ సమ్మిళిత సమాజాన్ని
రూపొందించడం లక్ష్యంగా ప్రతి చిన్నారిలో సామర్థ్యాలను పెంపొందించడం ప్రధాన ఉద్దేశంగా ఈ
కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.చంద్రశేఖర రావు, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కూన లలిత
తదితరులు ప్రసంగించారు.