ఉంటుందన్నారు.
విశాఖకు నేడు జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవం ఎంతో గర్వకారణమైన విషయమని.
భవిష్యత్తులో సైతం ఇదేవిధమైన వ్యవస్థను అమలు చేసే విధంగా విధానాలు ఉండాలన్నారు.
అధికారులను నేరుగా చేరుకుని ఫిర్యాధు చేసే భరోసా మహళలకు కల్పించడం ఎంతో
అవసరమని, ఇది వారికి ఎంతో ధైర్యాన్ని కలిపిస్తుందన్నారు. అత్యుత్తమ విధానాలను రాష్ట్ర
వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. నేడు విశాఖ మహిళలకు సురక్షిత
నగరంగా నిలవడం వెనుక అధికారుల కృషి, వారు తీసుకుంటున్న చర్యలు ఎంతో
దోహదపడ్డాయన్నారు. పోష్ చట్టం, ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటి (ఐసిసి) లు
పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం, పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు. ఈ దిశగా
జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. ఐసిసిలో అంతర్గత సభ్యులతో పాటు,
బయల వ్యక్తులను సభ్యులుగా ఏర్పాటు చేయడం ఎంతో మంచిదన్నారు. యుక్తవయస్సులో
ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతూ రాష్ట్ర వ్యాప్థంగా మహిళలు
ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు.
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ బధ్రత అంటే కేవలం శారీరక బధ్రత
అందించడమే కాదని, సామాజిక, ఆర్ధిక, ఆరోగ్య బధ్రత కూడా కల్పించడం ఎంతో
అవసరమన్నారు. విద్యతోనే ప్రతీ మహిళకు పూర్తి స్థాయిలో బధ్రత, భరోసా
లభిస్తాయన్నారు. ప్రతీ చిన్నారి పాఠశాలకు వెళ్లే విధంగా చూడటం, సంపూర్ణ ఆరోగ్యంతో
జీవించే విధంగా చూడాల్సిన అవసరమన్నారు. శిశుమరణాలు తగ్గించాల్సిన అవసరం
ఉందన్నారు. చట్టపరమైన న్యాయ సహాయం అందించడం కూడా బధ్రతలో భాగమేనన్నారు.
వృద్ధులను గౌరవంగా జీవించే విధంగా పెన్షన్ చేస్తోందన్నారు. యువతను, ముఖ్యంగా
అబ్బాయిల పెంపకంలో ఎంతో బాధ్యతగా తల్లదండ్రులు ఉండాలన్నారు. మహిళలను
గౌరవించడం వారికి నేర్పాలన్నారు. మహిళా సాధికారతకు ముందడుగు వేసే విధంగా స్త్రీ శక్తి
పథకం నిలుస్తోందన్నారు. వన్ స్టాప్ సెంటర్‌లు ఏర్పాటు చేసామని, మహిళలు ఎదుర్కొనే ఎటువంటి సమస్యనైనా ఇక్కడ తగిన సూచనలు, సలహాలు, సహాయం అందించడం
జరుగుతుందన్నారు. వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్‌ని మూడు ప్రాంతాలలో రూ 150 కోట్ల
వ్యయంతో నిర్మించడం జరుగుతోందన్నారు.
ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ మహిళావిద్యార్థినులకు బధ్రత కల్పించే
విధంగా ఏయూలో తొలిసారిగా మహిళా సెక్యూరిటీ గార్డ్‌ని నియమించామన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజం మహిళా బధ్రతతోనే సాకారం అవుతుందన్నారు. మహిళా గ్రీవెన్స్
సెల్ ఏయూ క్యాంపస్‌తో పాటు, అనుబంధ కళాశాలలకు సైతం సేవలు అందిస్తోందన్నారు.
విద్యార్థి విభాగంలో ప్రత్యేకంగా అసోసియేట్ డీన్‌గా మహిళను నియమించడం, మూడు
కీలకమైన డీన్ పదవుల్లో, ఏయూ క్యాంపస్‌లోని మూడు కళాశాలలకు ప్రిన్సిపాల్స్ గా
మహిళలను నియమించి ఏయూలో వీరికి సంపూర్ణ ప్రోత్సాహం అందించడం
జరుగుతోందన్నారు. సేఫ్ క్యాంపస్‌గా ఏయూను నిలుపుతున్నామన్నారు. త్వరలో ఒక
అధ్యయనం చేసి పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు.
మహిళలు మౌనాన్ని వీడి స్వేచ్చగా తమ సమస్యను, సవాళ్లను వెల్లడించాలన్నారు.
పోలీస్ కమీషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ ప్రతీ కార్యాలయంలో మహిళల బధ్రత
కల్పించే ప్రత్యేక కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. తద్వారా పాష్ చట్టాన్ని సమర్ధవంతంగా
అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలే పోలీసులకు కళ్లు, చెవులుగా
నిలుస్తున్నాయన్నారు. నగరంలో శాంతి బధ్రతల సమస్యలు వస్తాయని, విఘాతం
కలుగుతుందని అనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మహిళలు
పోలీసు స్టేషన్‌కి వెళ్లడానికి కొంత ఆలోచిస్తారని, అందుకే ప్రత్యేకమైన ఫోన్ నంబర్ అందించి
ఎప్పుడైనా తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చే అవకాశం కల్పించామన్నారు.
ఆన్‌లైన్ నేరాలు, వేధింపులు మహిళలపై అధికంగా జరుగుతున్నాయన్నారు. మహిళలు ఆర్ధికంగా బలోపేతం కావాలన్నారు. సమస్య ఎదురైన సందర్భాలలో ధైర్యంగా ఫిర్యాదు
చేయాలన్నారు.
దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఏ.పల్లవి సదస్సు
నిర్వహణ, ప్రాధాన్యతను వివరించారు. మహిళా బధ్రతకు తమ నిబద్దతను చాటే విధంగా ఈ
కార్యక్రమం నిలుస్తుందన్నారు. ఇది కేవలం ఒక నగరానికి లభించిన గుర్తింపే కాదని,
రాష్ట్రానికి లభించిన గౌరవమన్నారు. ముందుగా దుర్గాబాయి దేశముఖ్ విగ్రహానికి
పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అతిధులకు జ్ఞాపికలు బహూకరించి,
సత్కరించారు. కార్యక్రమంలో ఏయూ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధికారులు, ఉద్యోగులు,
పెద్దసంఖ్యలో మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.