వందేమాతరం 150 సంవత్సరాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగే స్మారక కార్యక్రమంలో భాగంగా, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఈనెల జనవరి 28 నుండి ఫిబ్రవరి 22 వరకు " సిఐఎస్ఎఫ్ వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్-2026"ను నిర్వహిస్తోందని సౌత్ జోన్-2 సిఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.జి. రాఘవేంద్ర కుమార్ తెలియజేశారు. సోమవారం
హార్బర్ పార్క్ పోర్ట్ గెస్ట్ హౌస్
కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సురక్షితతః, సమృద్ధ భారత్ సురక్షిత తీరం, సంపన్న భారతదేశం థీమ్ తో వందేమాతరం గీతం 150 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగే స్మారక కార్యక్రమంలో భాగంగా
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) ఈనెల జనవరి 28 నుండి ఫిబ్రవరి 22 వరకు“సిఐఎస్ఎఫ్ వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్-2026"ను
నిర్వహిస్తోందన్నారు. సైక్లోథాన్‌ను నిరంతర వార్షిక జాతీయ ఉద్యమంగా మార్చడానికి ఈ సైక్లోథాన్ దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల వెంబడి సుమారు 6,500 కిలోమీటర్లు ప్రయాణించి, తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలను కవర్ చేస్తుందన్నారు. జాతీయ భద్రతలో అంతర్భాగంగా తీరప్రాంత భద్రతపై విస్తృతమైన ప్రజా అవగాహన కల్పించడం, పౌరుల భాగస్వామ్యం, జాతీయ సమైక్యత, సాంస్కృతిక అనుసంధానం, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడం దీని
లక్ష్యమన్నారు.సైక్లోథాన్ అనేది 25 రోజుల పాటు జరిగే, దేశవ్యాప్తంగా తీరప్రాంత కార్యకలాపాలను ప్రోత్సహించే కార్యక్రమంగా తెలిపారు. ఇది తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలలో సుమారు 6,500 కి.మీ. దూరం ప్రయాణించి, భారతదేశ తూర్పు పశ్చిమ సముద్ర తీరాలలోని కమ్యూనిటీలు, యువత, వాటాదారులను నిమగ్నం చేస్తుందన్నారు.ఈ సైక్లోథాన్ ఎందుకు ముఖ్యమైనదో ఆయన వివరిస్తూ
భారత దేశ తీరప్రాంతం, దాని జాతీయ భద్రత ఆర్థిక వృద్ధికి కేంద్రంగా ఉందన్నారు.దేశ జనాభాలో దాదాపు 18శాతం మంది తీరప్రాంత జిల్లాల్లో నివసిస్తున్నారన్నారు.దేశ వాణిజ్యంలో దాదాపు 95 శాతం పరిమాణం పరంగా 70 శాతం విలువ పరంగా సముద్ర డొమైన్ ద్వారానే జరుగుతుందన్నారు.
3,300 కి పైగా తీరప్రాంత గ్రామాలు,
12 ప్రధాన ఓడరేవులు, 200 పైబడి చిన్న ఓడరేవులు, అనేక వ్యూహాత్మక ప్రదేశాలు, సంస్థాపనలు తీరం వెంబడి ఉన్నాయని తెలియజేశారు.
ఈ కీలకమైన జాతీయ ఆస్తిని కాపాడుకోవడంలో ప్రజలకు అవగాహన, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం సైక్లోథాన్
లక్ష్యమన్నారు. కోస్టల్ సైక్లోథాన్
ముఖ్య లక్ష్యాలు వివరిస్తూ
తీరప్రాంత భద్రతా అవగాహన,సముద్ర భద్రత, అప్రమత్తత, అత్యవసర ప్రతిస్పందనపై ప్రజలను, పౌర సమాజాలను సన్నిహితం చేయడం అన్నారు."తత్ ప్రహారీలు"గా ప్రజలను, మత్స్యకారులను, తీరప్రాంత నివాసితులను తీరప్రాంతంలో ముందు వరుస కాపలాదారులుగా శక్తివంతం చేయడం లక్ష్యమన్నారు.
జాతీయ ఐక్యత,సాంస్కృతిక అనుసంధానం తీరప్రాంత దేశం వైవిధ్యం, వారసత్వం, భాగస్వామ్య బాధ్యతను జరుపుకోవడం కోస్టల్ సైక్లోథన్ లక్ష్యం అని తెలిపారు.